లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు.. APMSRB గోల్డెన్ ఛాన్స్ !
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు జరపనుంది. ఈ మేరకు మొత్తం 185 ఖాళీలకు గాను దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించింది. లక్షకు పైగా జీతం అందించనున్న ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే వారు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
ఉద్యోగాల సంఖ్య..
185
పోస్టుల వివరాలు..
- జనరల్ ఫిజీషియన్ (టెలీ మెడిసిన్ హబ్) - 13 పోస్టులు
- గైనకాలజిస్ట్ (టెలీ మెడిసిన్ హబ్) - 03 పోస్టులు
- పీడియాట్రిషియన్ (DEICs) - 14 పోస్టులు
- మెడికల్ ఆఫీసర్ (UPHCs / UAAMS / DEICs / టెలీ మెడిసిన్ హబ్స్) - 155 పోస్టులు

విద్యార్హతలు..
- సంబంధిత పోస్టుకు MBBS ఉత్తీర్ణత తప్పనిసరి.
- స్పెషలిస్టు పోస్టులకు (Physician, Gynecologist, Pediatrician) MD/MS లేదా సంబంధిత PG స్పెషలైజేషన్ ఉండటం ప్రాధాన్యం.
- అనుభవం (Work Experience) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయోపరిమితి..
- OC అభ్యర్థులు - గరిష్టం 42 సంవత్సరాలు
- EWS/SC/ST/BC అభ్యర్థులు - గరిష్టం 47 సంవత్సరాలు
- ఇతర కేటగిరీలు (PH, Ex-Servicemen మొదలైన వారు) - 50 నుంచి 52 సంవత్సరాలు
వేతనం..
- జనరల్ ఫిజీషియన్ / గైనకాలజిస్ట్ - నెలకు రూ.1,10,000
- పీడియాట్రిషియన్ - నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు
- మెడికల్ ఆఫీసర్ - నెలకు రూ.61,960
దరఖాస్తు గడువు..
2025 ఆగస్టు 25 నుంచి 2025 సెప్టెంబర్ 10 వరకు
దరఖాస్తు ప్రక్రియ..
Online మాత్రమే
అప్లికేషన్ ఫీజు..
- OC అభ్యర్థులకు - రూ.1000
- BC, SC, ST, EWS అభ్యర్థులకు - రూ.750
ఎంపిక విధానం..
- అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అవసరమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశం ఉంది.
అభ్యర్ధులకు సూచనలు..
- దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
- అన్ని సర్టిఫికేట్లు, వయస్సు ఆధారాలు, కేటగిరీ సర్టిఫికేట్లు స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒప్పంద ప్రాతిపదికన నియామకం ఉంటుంది.
- నియామక సమయంలో బాండ్ లేదా సర్వీస్ అగ్రిమెంట్ పై సంతకం చేయవలసి రావచ్చు.
- సెలెక్ట్ అయినవారు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో, ముఖ్యంగా UPHCs, Urban Health Centres, Telemedicine Hubs లో పని చేయాల్సి ఉంటుంది.
స్థిరమైన వేతనంతో రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ సెంటర్లలో సేవ చేసే అవకాశం అందిస్తున్న ఈ ఉద్యోగాలకు ఆస్కాటి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసిన యువ వైద్యులకు ఇది గొప్ప అవకాశమని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ apmsrb.ap.gov.in చూసుకోవచ్చు.












Click it and Unblock the Notifications