ఏపీ డీఎంఈ జాబ్ రిక్రూట్‌మెంట్...225 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా, టెట్, డిఎస్సీ నోటిఫికేషన్ గురించి కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలయ్యింది. 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలయ్యింది. ఇక, ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన వారు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేందుకు అర్హులు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు చూద్దాం...
విద్యార్హత : సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.
వయసు : ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 52 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్ 50 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
అప్లయ్ చేసేందుకు ఫీజు : రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లయ్ చేయి విధానం : ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : విద్యార్హతలో సాధించిన మార్కులు, మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2024
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ https://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు చూద్దాం..
మొత్తం పోస్టులు - 255
అనస్థీషియా: 34 పోస్టులు
డెర్మటాలజీ: 06 పోస్టులు
ఎమర్జెన్సీ మెడిసిన్: 16 పోస్టులు
ఈఎన్‌టీ: 03 పోస్టులు
జనరల్ మెడిసిన్: 30 పోస్టులు
జనరల్ సర్జరీ: 18 పోస్టులు
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 05 పోస్టులు
న్యూక్లియర్ మెడిసిన్: 02 పోస్టులు
ఓబీజీ: 24 పోస్టులు
ఆర్థోపెడిక్స్: 08 పోస్టులు
పీడియాట్రిక్స్: 16 పోస్టులు
సైకియాట్రి: 15 పోస్టులు
రేడియో డయాగ్నోసిస్: 26 పోస్టులు
రేడియోథెరపీ: 02 పోస్టులు
టీబీ అండ్ సీడీ: 02 పోస్టులు
ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్: 03 పోస్టులు
ఆఫ్తల్మాలజీ: 11 పోస్టులు
ఫోరెన్సిక్ మెడిసిన్: 08 పోస్టులు
పాథాలజీ: 12 పోస్టులు
ఎస్‌పీఎం: 14 పోస్టులు












Click it and Unblock the Notifications