AP DSC అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. సిల‌బ‌స్ విడుద‌ల‌.. త్వ‌ర‌లో నోటిఫికేష‌న్‌..

ఏపీలోని డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎంత‌గానో ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ఏపీ విద్యాశాఖ డీఎస్సీ సిల‌బ‌స్‌ను విడుద‌ల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం అభ్యర్థులంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న వేళ రాష్ట్ర విద్యాశాఖ అభ్య‌ర్థుల‌కు కీలక అప్‌డేట్ అందించింది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నఅధికారులు, తాజాగా డీఎస్సీ సిల‌బ‌స్‌ను విడుద‌ల చేశారు. అభ్యర్థులు పరీక్షల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా డీఎస్సీ సిలబస్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఈ సిలబస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగ‌ల‌ర‌ని అధికారులు తెలిపారు.

AP DSC Candidates Alert Syllabus Released Soon Notification

వ‌చ్చే ఏడాది సంక్రాంతి లోపే..

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. .వచ్చే ఏడాది సంక్రాంతి లోపే మెగా డీఎస్సీ ద్వారా 16,347టీచ‌ర్ పోస్టుల‌ నియామకాలను పూర్తీ చేయాలనీ ల‌క్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. నిజానికి, ఈ నెల‌లోనే (నవంబర్) డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించిన రాష్ట్ర ప్ర‌భుత్వం, ప‌లు కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్పుడు తాజాగా ఏపీ విద్యాశాఖ డీఎస్సీ సిల‌బ‌స్‌ను విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు నేరుగా ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సిల‌బ‌స్‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+