ఏపీ దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామక పరీక్ష ఫలితాలు విడుదల
అమరావతి: దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్ష కోసం అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది.
60 ఈవో పోస్టుల భర్తీ కోసం జులై 24న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష రాసిన 52,915 మంది అభ్యర్థుల్లో.. 1278 మంది అర్హత సాధించారు. మెయిన్స్ అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలోనే తెలియజేస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది.

ఏపీ ఆర్బీకేలో త్వరలోనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే)లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వివరాలను వెల్లడించారు. ఈ శాఖలో మొత్తం 6758 అగ్రికల్చర్ అసిస్టెంట్, 4000 హార్టికల్చర్ అసిస్టెంట్, 400 స్కిల్ బోర్డు(పట్టు పరిశ్రమ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి.
అయితే, ఈ పోస్టుల్లో ఇప్పటి వరకు 6321 అగ్రికల్చర్ అసిస్టెంట్, 2356 హార్టికల్చర్ అసిస్టెంట్, 378 సిల్క్ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.
ఈ క్రమంలోనే మిగిలిపోయిన పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు.
5521 కాల్ సెంటర్ నెంబర్ ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి నెలా 1.51 లక్షల రైతు భరోసా మాస పత్రికలను ముద్రిస్తూ రైతులకు సాంకేతిక సలహాలు, సమాచారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications