ఇంజినీరింగ్ ఫీజుపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం.. క‌నీస ఫీజు రూ. 43వేలు..

ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌... ఇంజ‌నీరింగ్ క‌నీస ఫీజుపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజ‌నీరింగ్ కళాశాలలకు కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. గత ప్రభుత్వం హాయాంలో ఫీజులు తగ్గింపుపై క‌ళాశాల‌ల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగ‌తి తెలిసిందే.. ఈ నేప‌థ్యంలో రూ.45వేలు ఇవ్వాలని కళాశాల‌ల‌ యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో క‌ళాశాల‌ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ధ‌ర్మాస‌నం 2023 జూన్‌లో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అమలు చేయాలని ఆదేశించింది. ఈ క్ర‌మంలో చర్చల అనంతరం కనీస ఫీజు రూ.43వేలుగా ఖరారైన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ఈ నెల 7వ తేదీన కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయిస్తూ ప్ర‌భుత్వం మొదట ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారమే కౌన్సెలింగ్‌లో కళాశాలల ఫీజులను పెట్టారు. సీట్లు కేటాయించడానికి ఒక రోజు ముందు ఏపీ ప్రభుత్వం ఇంజినీరింగ్ కనీసం ఫీజును రూ.43 వేలు చేసేందుకు అంగీకరించింది. దీంతో కౌన్సెలింగ్‌లో ఫీజులను మార్పు చేశారు. ఇంజినీరింగ్ సీట్లు పొందిన అభ్యర్థులకు ఇచ్చిన లేఖల్లో కనీస ఫీజు రూ.43వేలుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

AP Govt takes key decision over engineering fee delares rs 43k as minimu fee

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై ఇటు విద్యార్థుల్లో అటు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.రాష్ట్రంలో 210 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా అందులో దాదాపుగా 8 ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.భీమవరంలోని విష్ణు ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫీజు రూ.1.03 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది.విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ్ కాలేజ్, పీవీపీ సిద్ధార్థ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్,గుంటూరులోని ఆర్వీఆర్ & జేసీ ఇంజినీరింగ్ కాలేజ్‌లలో రూ లక్షకు పైగా ఫీజులున్నాయని సమాచారం.అయితే ఇందులో ట్యూషన్ ఫీజ్, ఐడీ కార్డు,మెడికల్ ఫీజు, ఇంటర్ కాలేజ్ లేదా ఇంటర్ యూనివర్శిటీ స్పోర్ట్స్, గేమ్స్ మరియు కల్చరల్ మీట్ ఫీజ్,కంప్యూటర్ ఇంటర్నెట్ ఫీజు,కాలేజ్ మ్యాగజీన్‌తో పాటు ఇతరత్ర ఖర్చులన్నీ ఇదే ఫీజులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+