ఈ నెల 28న ఏపీ సెట్‌ 2024 ప‌రీక్ష‌.. అడ్మిట్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

ఈ నెల 28 న ఏపీ సెట్ 2024 ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2024 అడ్మిట్‌కార్డులు ఈ నెల 19న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లోఏప్రిల్ 28వ తేదీన జరగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాట్ల‌ను చేస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తోంది. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీలెక్చరర్లుగా ఉద్యోగం పొందాలంటే ఏపీ సెట్ ప‌రీక్ష‌లో అర్హత పొందాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ప్రతీ సంవ‌త్స‌రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ప‌రీక్ష మొత్తం 30 సబ్జెక్టుల్లో ఉంటుంది. ఏపీ సెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. మొద‌టి పేప‌ర్ జనరల్ స్టడీస్, 50 ప్రశ్నలకు 100 మార్కులు. రెండో పేప‌ర్ అభ్య‌ర్థులు ఎంచుకున్న స‌బ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటల స‌మ‌యం ఉంటుంది.

AP SET 2024 exam on 28th of this month Download admit cards like this

పేపర్-1 పరీక్ష ఆంగ్ల‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్-2లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి.

పేప‌ర్ 2లో ఉండే సబ్జెక్టులు ఇవే..

ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.

రాష్ట్రంలోని పరీక్ష కేంద్రాలివే..

విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+