AP 10th Exam: ఉగాది పండగ, మారిన టెన్త్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే విడుదలైన పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేసినట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం ఉగాది పండగ మార్చి 20వ తేదీన రావడంతో, ఆ రోజున నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. దీంతో ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20కి బదులుగా మార్చి 21వ తేదీన నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు గమనించాలని సూచించింది.

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల సమయాల్లో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
మారిన EXAM టైమ్‌టేబుల్ ప్రకారం
- మార్చి 16 - ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18 - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21 - ఇంగ్లిష్ (మార్చి 20 నుంచి మారింది)
- మార్చి 23 - మ్యాథమెటిక్స్
- మార్చి 25 - ఫిజికల్ సైన్స్
- మార్చి 28 - బయాలజికల్ సైన్స్
- మార్చి 30 - సోషల్ స్టడీస్
విద్యార్థులు తాజా షెడ్యూల్‌ను అనుసరించి తమ రివిజన్ ప్లాన్ సవరించుకోవాలని, ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్
Download











Click it and Unblock the Notifications