APEDCET : బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల..
బీఈడీ కాలేజీల్లో స్పాట్, కన్వీనర్ కోటా సీట్ల భర్తీకీ షెడ్యూల్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ కళాశాలల్లో స్పాట్, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ కింద వచ్చే నెల 12 లోపు భర్తీ చేయాలని సూచించింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3 వరకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపింది. ఇక, ఈ వివరాలను వెబ్ పోర్టల్‌లో వచ్చే నెల 12లోపు అప్‌లోడ్ చేయాలని చెప్పింది.
గత సంవత్సరం ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. ఇక, ఈ ప్రవేశపరీక్ష జూన్ 14, 2023న జరిగింది. ఈ పరీక్షను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 77 పరీక్ష కేంద్రాల్లో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకున్నారు. 11,235 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జులై 14న ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 10,908 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

రాష్ట్రంలోని కళాశాలల్లో 34 వేలకుపైగా సీట్లు..
ఈ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి యాజమాన్యాలను ఆదేశించింది. యాజమాన్య కోటా 25 శాతం సీట్ల కోసం వచ్చే నెల 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని చెప్పింది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని సూచించింది. దీంతోపాటు సబ్జెక్టు మెథడాలజీ ప్రకారమే సీట్లు కేటాయించాలని యాజమాన్యాలను ఆదేశించింది. రాష్ట్రంలో మొత్తం 411 బీఈడీ కళాశాలల్లో 34 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే రెండు విడత కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. ఇక మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్‌తోపాటు, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్నారు.
స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూలు వివరాలు..
నోటిఫికేషన్: 28.03.2024.
స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహణ: 30.03.2024 - 03.04.2024.
వెబ్‌పోర్టల్‌లో స్పాట్ ప్రవేశాల అప్‌లోడింగ్: 04.04.2024 - 12.04.2024.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 04.04.2024 - 12.04.2024.
స్పాట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు https://edcet-sche.aptonline.in/EDCETDocuments/Home/EdCET-2023%20%20Spot%20guidelines-imp_25032024040315.pdf ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశ షెడ్యూలు వివరాలు..
మేనేజ్‌మెంట్ కోటా (బి-కేటగిరి) ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04.04.2024.
బి-కేటగిరి ప్రవేశాల అప్‌లోడింగ్: 04.04.2024 - 12.04.2024.
మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు https://edcet-sche.aptonline.in/EDCETDocuments/Home/EdCET%202023%20CAT-B%20GUIDELINES-imp_25032024040320.pdf ఈ లింక్‌ను క్లిక్ చేయండి..












Click it and Unblock the Notifications