8 ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఏకంగా 8 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ నెలలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 27 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం https://portal-psc.ap.gov.in సంప్రదించవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.
పరీక్ష తేదీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తిరుపతి ఎన్ఏఆర్ఎల్‌లో జూనియర్ రీసెర్చ్ పోస్టులు, మంచి జీతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(NARL).. 19 జూనియర్ రీసెర్చ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిక, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఫిజిక్స్/అట్మాస్పియరిక్ సైన్స్/స్పేస్ ఫిజిక్స్/మెటలర్జీ తదితర విభాగాల్లో పీజీతోపాటు సీఎస్ఐఆర్-యూజీసీ నెట్/గేట్/జామ్/జేఈఎస్‌టీ స్కోర్.
వేతనం: రూ. 37 వేలు, నెలకు.
వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 8 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24, 2025
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.narl.gov.in/ సంప్రదించవచ్చు.
తూర్పుగోదావరిలో 61 ఉద్యోగాలు
తూర్పు గోదావరి జిల్లాలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ 61 పలు పోస్టులను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు:
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 03
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 20
శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 38
అర్హతలు:
పదో తరగతి, ఇంటర్మీడియట్. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)తోపాటు పని అనుభవం, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయో పరిమతి:
52 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ. 500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ 200.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతతోపాటు మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 20, 2025.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://eastgodavari.ap.gov.in/ ను సంప్రదించవచ్చు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications