ఏపీ సెట్ ఫలితాలు విడుదల.. మీ నెంబర్ ఉందో లేదో చూసుకోండి!
ఏపీ సెట్ ఫలితాలు 2024 విడుదలయ్యాయి. అభ్యర్థులు ఏపీసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, సెక్యూరిటీ కీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) - 2024 ఫరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ సెట్ పరీక్షను ఏప్రిల్ 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. అర్హత సాధించిన వారి వివరాలు, ఫైనల్ కీ, ర్యాంక్ కార్డు, సబ్జెక్టుల వారీ కటాఫ్ మార్క్స్, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఏపీ సెట్ పరీక్ష ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 30,448 మంది హాజరవగా, 2,444 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను చెక్‌చేసుకునేందుకు https://apset.net.in/PubResAPSET.aspx ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 10వ తేదిన ఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 19న విడుదల చేశారు. ఏప్రిల్ 28వ తేదీన రాష్టవ్యాప్తంగా ఏపీసెట్-2024 ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష జరిగింది.

రెండు పేపర్లు..
ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1, పేపర్ 2. పేపర్ 1లో (జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఇది అందరికీ ఒకేలా ఉంటుంది. ఇక, పేపర్-2 (అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం ఉంటుంది. పేపర్-1 పరీక్ష ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్-2లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications