APTWREIS: ఏపీ గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనం...
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో రెగ్యులర్ బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్ పదో తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు స్టేట్ సిలబస్, ఇంగ్లీషు మీడియం, ఫ్రీ ఎడ్యుకేషన్, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణను కూడా అందిస్తారు. అయిదో తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు. 6, 7, 8, 9 తరగతి రెగ్యులర్ బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే అప్లయ్‌చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశాల వివరాలు ఇలా...
విద్యార్హత : తరగతిని అనుసరించి నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం చదివి ఉన్న వారు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షకాదాయం లక్షరూపాయలకు మించకూడదు.

సీట్ల ఖాళీల వివరాలు: 5వ తరగతిలో 2480 సీట్లు ఖాళీలు ఉండగా, ఆరో తరగతిలో 481 సీట్లు, ఏడో తరగతిలో 174 ఖాళీలు ఎనిమిదో తరగతిలో 111 సీట్లు, తొమ్మిదో తరగతిలో 188 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
రిజర్వేషన్: 5వ తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 6, 7, 8, 9 తరగతి రెగ్యులర్ బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక ప్రక్రియ వివరాలు : రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఇందులో సీటు కేటాయిస్తారు.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, చిత్తూరు, కడప, అనంతపురం
ముఖ్య తేదీలు...
- ప్రవేశ ప్రకటన: 15.02.2024
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10-04-2024
- హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 11-04-2024
- ప్రవేశ పరీక్ష తేదీ: 21-04-2024
- మెరిట్ జాబితా వెల్లడి: 10-05-2024
- పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
- పరీక్ష కేంద్రాల్లో ఎంపిక జాబితాలు: 20.05.2024
- ఎంపికైన విద్యార్థుకలు సమాచారం: 22.05.2024
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications