రైల్వేలో అసిస్టెంట్ లోకో పైల‌ట్ ఉద్యోగాలు... ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌... దేశ‌వ్యాప్తంగా 5,696 అసిస్టెంట్ లోకోపైల‌ట్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఈ పోస్టుల‌కు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు షార్ట్ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. ఈ పోస్టుల‌కు అర్హ‌త, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోగ‌ల‌రు. ముందుగా అభ్యర్థులు RRB ALP నోటిఫికేషన్ 2024ను RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్లలో నోటిఫికేష‌న్‌ను గ‌మ‌నించ‌గ‌ల‌రు. ఈ పోస్టుల‌కు జ‌న‌వ‌రి 20నుంచే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 19 చివ‌రితేదిగా ప‌రిగ‌ణించ‌డ‌మైన‌ది. ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలుసుకుందాం.

విద్యార్హతలు : ఈ పోస్టులకు అప్ల‌య్ చేసుకోవాల‌నుకున్న‌ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా Mechanical, Electrical, Electrical, Electronics or Automobile Engineering విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉన్న‌వారు కూడా అర్హులే. లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Assistant Loco Pilot Jobs in Railways... Application Process Begins..

శాల‌రీ : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెల‌వారీ వేత‌నం రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది.
అప్ల‌య్ చేసుకునేందుకు వయసు : దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫీజు వివ‌రాలు : ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌-సర్వీస్ మెన్‌, మహిళలకు రూ.250.. మిగిలిన వారు 500 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల కోసం www.indianrailways.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌గ‌ల‌రు.

ప‌రీక్ష ఎంపిక విధానం :

రాత ప‌రీక్ష, స్కిల్/ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల‌కు ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్స్‌...

అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గౌహతి, జమ్మూ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+