BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం.. లక్షల్లో జీతం..
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,267 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రత్యేకంగా, స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నియామకం బ్యాంకింగ్ రంగంలో పనిచేయడానికి ఎదురు చూస్తున్నవారికి మంచి అవకాశం.
ఖాళీల వివరాలు:
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్న 1267 పోస్టులు వివిధ విభాగాలలో ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన విభాగాలు, పోస్టుల ప్రకారం రూరల్ & అగ్రి బ్యాంకింగ్ కింద అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ . రిటైల్ లయబిలిటీస్ విభాగం కింద మేనేజర్ - సేల్స్, MSME బ్యాంకింగ్ కింద మేనేజర్ - క్రెడిట్ అనలిస్ట్, సీనియర్ మేనేజర్ - MSME రిలేషన్షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో సీనియర్ డెవలపర్, డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇతర విభాలైన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

విద్యార్హతలు:
వివిధ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కాన్ని పోస్టులకు బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎఫ్‌ఏ వంటి కోర్సులు ఉంటే ప్రాధాన్యత ఉటుంది. కొన్ని పోస్టులకు నిర్దిష్ట అనుభవం కూడా అవసరం. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు. వయస్సు పరిమితి కనిష్ట వయస్సు 25 ఏళ్లు, గరిష్ట వయస్సు 40 ఏళ్లు. SC/ST/OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
అనుభవం:
కొన్ని పోస్టులకు కనీసం 2-5 సంవత్సరాల అనుభవం అవసరం.
అనుభవం అవసరం లేని పోస్టులు కూడా ఉన్నాయి
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: డిసెంబర్ 27, 2024
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 28, 2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 17, 2025
దరఖాస్తు ఫీజు :
జనరల్ , ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 600 , ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ, మహిళలకు రూ.100 . పేమెంట్ మోడ్ ఆన్ లైన్ ద్వారా ( డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ) చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://www.bankofbaroda.in ద్వారా తెలుసుకోవచ్చు.
జీతం - ప్రయోజనాలు
జీత శ్రేణి:రూ. 48,480 నుండి రూ. 1,35,020 వరకు ఉంటుంది . ఈ బ్యాంకు ఉద్యోగం పొందిన వారికి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, లీవ్ సదుపాయాలు, పెన్షన్ ,ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.












Click it and Unblock the Notifications