Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెలకు రూ.1,20,940 జీతంతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ !

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్ధులకు కీలక అలర్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడా పలు విభాగాల్లో మేనేజర్‌, సీనియర్ మేనేజర్‌, చీఫ్ మేనేజర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 01, 2025 చివరి తేదీ కావడంతో.. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లు, కార్పొరేట్ ఆఫీసులు, జోనల్ సెంటర్లు వంటి వివిధ విభాగాల్లో నియమించబడతారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, సీఏ (CA), సీఎంఏ (CMA), సీఎస్‌ (CS), సీఎఫ్‌ఏ (CFA), డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, కార్పొరేట్ లెండింగ్‌, రిస్క్ మేనేజ్మెంట్‌, క్రెడిట్ అసెస్‌మెంట్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు మెరుగైన అవకాశాలను పొందగలరు. ఎంపికైన వారు భారీ జీతంతో పాటు స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడుతుంది. ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని ఆసక్తి గల అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవచ్చు.

bank-of-baroda-notification-for-50-posts-and-last-date-to-apply-details

మొత్తం ఖాళీలు..

50

ఖాళీల వివరాలు..

మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 01 పోస్ట్

సీనియర్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 25 పోస్టులు

చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 02 పోస్టులు

సీనియర్ మేనేజర్ (సీ & ఐసీ రిలేషన్‌షిప్‌ మేనేజర్): 16 పోస్టులు

చీఫ్ మేనేజర్ (సీ & ఐసీ రిలేషన్‌షిప్‌ మేనేజర్): 06 పోస్టులు

వయో పరిమితి..

అభ్యర్థుల వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ప్రభుత్వ నియమావళి ప్రకారం వయస్సులో సడలింపులు ఉన్నాయి:

ఓబీసీలకు: 3 సంవత్సరాలు

ఎస్సీ/ఎస్టీలకు: 5 సంవత్సరాలు

దివ్యాంగులకు: 10 సంవత్సరాలు

ఎంపిక విధానం..

ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. పరీక్షా సిలబస్‌, సెంటర్ వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.

జీతం..

ఎంపికైన వారికి ఆకర్షణీయమైన వేతన ప్యాకేజ్ లభిస్తుంది.

మేనేజర్: రూ.64,820 - రూ.93,960

సీనియర్ మేనేజర్: రూ.85,920 - రూ.1,05,280

చీఫ్ మేనేజర్: రూ.1,02,300 - రూ.1,20,940

అదనంగా, డిఏ (Dearness Allowance), హెచ్‌ఆర్‌ఏ (House Rent Allowance), మెడికల్ అలవెన్స్‌, లీవ్ ట్రావెల్ కన్సెషన్, పెన్షన్, బోనస్‌, గ్రాచ్యుటీ వంటి అన్ని సౌకర్యాలు కూడా అందిస్తారు.

దరఖాస్తు రుసుము..

జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.850

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు: రూ.175

చెల్లింపు డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయాలి.

దరఖాస్తు ప్రక్రియ..

అధికారిక వెబ్‌సైట్‌ www.bankofbaroda.in ను సందర్శించి ఆన్ లైన్ లో చేయాలి. Careers → Current Opportunities" విభాగంలోకి వెళ్లండి. సంబంధిత పోస్టును ఎంపిక చేసి "Apply Now" పై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలు నమోదు చేసి, పత్రాలు (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) అప్‌లోడ్ చేయండి. ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిషన్ తర్వాత దరఖాస్తు కాపీని సేవ్ చేసుకోండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+