నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. లక్ష జీతంతో ఉద్యోగాలు !
బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. రెగ్యులర్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, మేనేజర్ డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీస్ డెవలపర్, సీనియర్ మేనేజర్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి దాదాపు లక్షకు పైగా వేతనం లభించనుంది. అయితే మార్చి 11తో ఈ పోస్టులకు దరఖాస్తు గడువు ముగియగా.. 21 వరకు పొడిగించడంతో అప్లై చేసుకొని వారికి మరో మంచి ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...
నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు..
మొత్తం ఖాళీలు..
518
విద్యార్హత..
డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలానే అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ..
మార్చి 21
పోస్టుల వారీగా ఖాళీలు..
సీనియర్ మేనేజర్, ఆఫీస్-డెవలపర్, మేనేజర్-డెవలపర్ ఫుల్‌స్టాక్, ఆఫీసర్-క్లౌడ్ ఇంజినీర్, ఆఫీసర్-ఏఐ ఇంజినీర్, మేనేజర్-ఏఐ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ ఏఐ ఇంజినీర్ సహా పలు పోస్టులలో ఖాళీలు ఉన్నాయి.
వయస్సు..
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు.
పోస్ట్ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్-3 - 27 నుంచి 37 ఏళ్లు
ఎంఎంజీ/ఎస్-2 - 24 నుంచి 34 ఏళ్లు
జేఎంజీ/ఎస్-1- 22 నుంచి 32 ఏళ్లు
ఎస్‌ఎంజీ/ఎస్-4 - 33 నుంచి 43 ఏళ్ల
వేతనం..
ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది.
నెలకు పోస్ట్ గ్రేడ్- జేఎంజీ/ఎస్-1 - రూ.48,480
ఎంఎంజీ/ఎస్-2 - రూ.64,820
ఎంఎంజీ/ఎస్-3 - రూ.85,920
ఎస్‌ఎంజీ/ఎస్-4 - రూ.1,02,300
ఎంపిక విధానం..
ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
అర్హత ఉన్న అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ https://www.bankofbaroda.in ద్వారా వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications