పరీక్ష లేకుండానే bank of maharashtra లో జాబ్స్.. రెండు రోజులే ఛాన్స్ !

ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర Bank of Maharashtra నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. 2026 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 600 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

ఈ నోటిఫికేషన్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం. దీంతో పరీక్షల ఒత్తిడి లేకుండా అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశాలు మరింత పెరిగాయి.
అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ - 11 పోస్టులు, తెలంగాణ - 17 పోస్టులు ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండటంతో దేశవ్యాప్తంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ ( bank of maharashtra )పోస్టుల కోసం మరిన్ని వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

bank-of-maharashtra-notification-for-apprentice-jobs-without-exam-and-last-date-for-application-deta

(Bank of Maharashtra) నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

విద్యార్హతలు..

ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉండాలి.

అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత అనుభవం లేదా ట్రైనింగ్ వివరాలు ఉండటం అవసరం.
విద్యార్హతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంక్ సూచించింది.

వయోపరిమితి & సడలింపులు..

అభ్యర్థుల వయోపరిమితి:

కనీస వయస్సు: 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

వయోసడలింపులు:

ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు

ఓబీసీ అభ్యర్థులకు - 3 సంవత్సరాలు

పీడబ్ల్యూబీడీ (దివ్యాంగులు) - గరిష్టంగా 10 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం..

ఈ అప్రెంటిస్ పోస్టులకు

రాత పరీక్ష లేదు

అభ్యర్థుల డిగ్రీ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి ఎంపిక చేస్తారు.
దీంతో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లకు నేరుగా అవకాశం లభించనుంది.

స్టైపెండ్ & శిక్షణ వివరాలు..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹12,300 స్టైపెండ్ అందజేస్తారు. అప్రెంటిస్‌షిప్ సమయంలో బ్యాంకింగ్ ( bank of maharashtra ) కార్యకలాపాలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధం కావడంలో ఎంతో ఉపయోగపడే అనుభవంగా మారుతుంది.

దరఖాస్తు విధానం & ముఖ్య తేదీలు..

దరఖాస్తు ప్రారంభం: జనవరి 15, 2026

చివరి తేదీ: జనవరి 25, 2026

దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు.

అభ్యర్థులకు సూచనలు..

దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి

రాష్ట్రాల వారీ ఖాళీలు, అర్హతలు, నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి

చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయడం మంచిది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+