BELలో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL) హైదరాబాద్.. నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ. బెల్ లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అప్లికేషన్ కు చివరి తేదీ ఏప్రిల్ 9 గా ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 32

1. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్ ట్రైనీ(EAT): 08
2. టెక్నీషియన్‌ కేటగిరీ- సీ: 21
3. జూనియర్‌ అసిస్టెంట్: 03

BEL Government Defense Company Job Recruitment Apply by April 9

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాక సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణతతో పాటు అనుభవం కూడా అవసరం.

వయోపరిమితి: అభ్యర్థులు మార్చి 1, 2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.250.. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ విధానంలో టెస్టు ఆధారంగా..

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా సంబంధిత అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాథమిక డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకుని అప్లై విధానం పూర్తి చేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2025 దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది.

వేతనం: నెలకు టెక్నీషియన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.21,500 - రూ.82,000, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ట్రైనీకి రూ.24,500- రూ.90,000 గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+