BELలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ పాసయ్యారా.. అయితే అప్లయ్ చేయండి..!
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 108 ట్రైనీ ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 సెప్టెంబర్ 2020
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ట్రైనీ ఇంజినీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 108
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 సెప్టెంబర్ 2020
విద్యార్హతలు:
ట్రైనీ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ
ప్రాజెక్ట్ ఇంజినీర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ

వయస్సు:
ప్రాజెక్టు ఇంజినీర్: 28 ఏళ్లు
ట్రెయినీ ఇంజినీర్: 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు అప్లికేషన్ ఫీజు రూ. 500 ఉండగా ట్రైనీ ఇంజినీర్‌కు రూ.200
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 07-09-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27-09-2020












Click it and Unblock the Notifications