BELలో సీనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు : జీతం నెలకు రూ.1,60,000
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసి అనుభవం ఉన్నవారికి మంచి అవకాశం కల్పిస్తోంది. సీనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడదుల చేసింది. కరోనా కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చాలా సంస్థలు నిలిపివేశాయి. అయితే తిరిగి ఉద్యోగాల నియామకాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కూడా ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు డివిజన్ నుంచి తాజా ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి సీనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ బెంగళూరు కేంద్రంగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భర్తీ చేయనున్నారు.

ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇంజినీర్ పోస్టులు 50 ఉన్నాయి. అవి మెకానికల్ ఇంజినీరింగ్‌లో 20 ఉండగా, కంప్యూటర్ సైన్స్‌లో 10 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 10 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి. ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టింది. ఇక ప్రభుత్వ పరమైన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులంతా బెంగళూరు డివిజన్‌లో పనిచేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు కూడా బాగానే ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థుల వేతనం నెలకు రూ. 50,000-1,60000 ఉంటుంది. అంటే ఏడాదికి అన్నీ కలుపుకుని రూ.14 లక్షల వరకు ఉంటుంది.
అభ్యర్థులు విద్యార్హతల విషయానికొస్తే నాలుగేళ్ల ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇది ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్ /సివిల్ /కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌క్లాస్ డిగ్రీ ఉండాలి. నాలుగేళ్ల పాటు పని అనుభవం తప్పనిసరి. ఇక ఆయా విభాగాల్లో ఎంటెక్ చేసినవారికి రెండేళ్లు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పాస్ అయితే చాలు.
అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సీనియర్ ఇంజినీర్‌కు జనరల్ అభ్యర్థులు రూ.750/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. అభ్యర్థులను రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 07 సెప్టెంబర్ 2021. మరిన్ని వివరాలకు అభ్యర్థులు register.cbtexam.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇంకెందుకు ఆలస్యం.. అన్ని అర్హతలు ఉండి పని అనుభవం కూడా ఉంటే ఈ ఉద్యోగం మీదే కావొచ్చు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications