రూ.81 వేల జీతంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. DON'T MISS !
దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నిరుద్యోగులకు తీపికబురు ప్రకటించింది. మొత్తం 1121 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు తక్షణమే అప్లై చేసుకోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు, ప్రక్రియ సహా మిగతా వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం పోస్టులు..
1121
ఖాళీలు..
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910
హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211

విద్యార్హత..
టెన్త్, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
వయస్సు పరిమితి..
- 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు.
వేతన వివరాలు..
సెలెక్ట్ అయిన వారికి రూ.25,500 నుంచి రూ.81,100 వరకు నెలవారీ జీతం లభిస్తుంది. అదనంగా బీఎస్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు, మెడికల్ సౌకర్యాలు, పెన్షన్, ఫ్యామిలీ బెనిఫిట్స్ లభిస్తాయి.
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక పలు దశల పరీక్షల ద్వారా జరుగుతుంది.
- లిఖిత పరీక్ష
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)
- మెడికల్ ఎగ్జామినేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
తదుపరి దశలను క్లియర్ చేసిన అభ్యర్థులకే తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు గడువు..
2025 ఆగస్టు 24 నుంచి 2025 సెప్టెంబర్ 23
దరఖాస్తు విధానం..
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. అధికారిక వెబ్‌సైట్: https://www.bsf.gov.in/ లో దరఖాస్తు చేసేటప్పుడు ఫోటో, సంతకం, అవసరమైన విద్యా సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
దరఖాస్తు ఫీజు..
అప్లికేషన్ ఫీ (జనరల్, ఓబీసీ అభ్యర్థులు) రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు.












Click it and Unblock the Notifications