స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉంటే కానిస్టేబుల్ జాబ్ మీకే

మీరు పోలీస్ కావాలనుకుంటున్నారా.. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కొలువు కోసం ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్నారా. అయితే మీ కోసమే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి పూర్తి చేసి ఉంటే చాలు మీరు జాబ్ కు అప్లై చేయడానికి మొదటి అర్హత సాధించినట్లే. అయితే పోలీస్ ఉద్యోగం కాబట్టి.. అందులోనూ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కాబట్టి చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని గురించి పూర్తి వివరాల ఇక్కడ తెలుసుకుందాం

549 పోస్టులు..

బీఎస్‌ఎఫ్‌ స్పోర్ట్స్‌ కోటాలో 549 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం జనరల్‌ డ్యూటీ విభాగంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పురుషులకు 277, మహిళలకు 272 పోస్టులు కేటాయించారు. పదో తరగతి విద్యార్హతతో పాటు స్పోర్ట్ క్యాటగిరిలో సత్తా చాటికి వారికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన విడదల చేసింది. ఈ ప్రకటనలో అథ్లెటిక్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, టేబుల్‌ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్, వాటర్‌ స్పోర్ట్స్, ఉషు వంట వాటిల్లో కనీస రాష్ట్ర స్థాయిలో రాణించిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. అలాగే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పతకం లేదా వెండి పతకం కాంస్య పతకాలు సాధించిన లేదా పాల్గొన్నవారికి మొదటి ప్రాధాన్యమిస్తారు. జాతీయ క్రీడాపోటీల్లో పతకాలు సాధించిన వారికి రెండో ప్రాధాన్యమిస్తారు. మీరు సాధించిన పతకాల ఆధారంగా మీరు మెరిట్ మార్కులు కేటాయించబడతాయి.

BSF Recruitment Alert 10th Pass Candidates Eligible for Central Government Jobs

కావాల్సిన అర్హతలు..

ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌ విభాగంలో పురుషుల 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ క్యాటగిరి అభ్యర్ధలు 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఇక జనరల్ అండ్ బీసీ మహిళలు 157 సెం.మీ హైట్.. ఎస్టీ మహిళా అభ్యర్ధులు 150 సెం.మీ.హైట్ ఉండాలి. జనరల్ విభాగంలో పురుషుల ఛాతీ 80 సెం.మీ.ఉండి.. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ.పెరగాలి. అదే విధంగా ఎస్టీ విభాగంలో పురుషుల ఛాతి 76 సెం.మీ..ఉండి, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి. వీటితో పాటుగానే ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో పాటు క్రీడా ప్రదర్శన ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ తయారు చేసి నియామక ప్రక్రియను పూర్తిచేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు గరిష్ఠంగా ( పదవీ విరమణ సమయానికి) అందుకుంటారు

అప్లికేషన్ లింక్..

వయసు పరిమితి కూడా జనరల్ అభ్యర్ధుకలు 23 సంవత్సరాలు మించకూడదు. అలాగే OBC, NCL కు మూడేళ్లు సడలింపు ఉంటుంది. SC, ST అభ్యర్ధులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ విభాగలో రూ.159 గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 15.01.2026 కాగా.. https://rectt.bsf.gov.in/ ఈ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+