సీఏ ఫైనల్, ఇంటర్ 2024 పరీక్షల ఫలితాలు విడుదల..
సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్ష 2024 ఫలితాలను ఐసీఏఐ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫలితాలను నేరుగా చెక్‌చేసుకోగలరు. ఈ ఫలితాలను చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సీఏ ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షలు ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఐసీఎఐ సీఎ ఫైనల్, ఇంటర్ ఫలితాలతో పాటు టాపర్స్ జాబితాను కూడా విడుదల చేసింది.
ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సీఎ ఫైనల్ పరీక్షల్లో దేశ రాజధాని ఢిల్లీకి చెందిన శివమ్ మిశ్రా టాపర్‌గా నిలిచాడు. శిమమ్‌కు ఈ పరీక్షలో 600 మార్కులకు గాను 500 మార్కులు వచ్చాయి. ఇక, ఈ ఏడాది మేలో నిర్వహించిన సీఎ ఇంటర్ పరీక్షలో కుశాగ్రా రాయ్ 600 మార్కులకు గాను 583 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు ఈ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి https://icai.nic.in/caresult/ తమ ఫలితాలను చెక్ చేసుకోగలరు.

రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం..
ఈ ఏడాది మే లో జరిగిన సీఎ ఫైనల్ పరీక్షల ఉత్తీర్ణత శాతం ఓసారి పరిశీలిస్తే..గ్రూప్1 లో 74,887 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 20,479మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. అంటే ఉత్తీర్ణత శాతం 27,35 శాతంగా ఉంది. ఇక, గ్రూప్ 2 విషయానికొస్తే 58,891 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరవ్వగా, 21408మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 36.35 శాతంగా ఉంది. ఫలితాలను చెక్‌చేసుకునేందుకు విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్‌లో కనిపించే ఎగ్జామ్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ రోల్ నంబర్, పిన్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే మీ ఫలితాలు స్క్రీన్ పై డిస్‌ప్లే అవుతాయి. ఫలితాలను తదుపరి చర్యల కోసం సేవ్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications