CBSE: డిసెంబర్ 2024 సెషన్ నోటిఫికేషన్ వచ్చేసింది... రిజిస్ట్రేషన్ ప్రారంభం..
సీటెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. సెంట్రల్ టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ డిసెంబర్ 2024 సెషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. సీబీఎస్ఈ ప్రతి ఏటా రెండు సార్లు సీటెట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జులై సెషన్2024 పరీక్షలు ముగియగా, తాజాగా డిసెంబర్ 2024 నోటిఫికేషన్‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సీటెట్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ పరీక్షను రాయాలనుకునేవారు దరఖాస్తు చేసుకోగలరు. సీటెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 17వ తేది నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 1, 2024న సీటెట్ పరీక్షను ఆఫ్‌లైన్ (పెన్ను పేపర్) విధానంలో నిర్వహించనున్నారు.
సీటెట్ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏటా రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్‌ను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లలో ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారు రాస్తారు. ఇక, రెండో పేపర్ ఆరోతరగతి నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్ష స్కోర్ జీవిత కాల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

విద్యార్హతలు..
పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/ డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్), బీఈఎల్‌ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగలరు.
ఫీజు వివరాలు..
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క పేపర్‌కు మాత్రమే. అదే రెండు పేపర్లు రాయాలనుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులయితే ఒక్క పేపర్‌కు రూ.500 చెల్లించాలి. రెండు పేపర్లకయితే రూ.600చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలివే..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2024
దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేది: 16.10.2024
దరఖాస్తు సవరణ తేదీలు : 21.10.2024 నుంచి 25.10.2024
సీటెట్ పరీక్ష తేదీ: 01-12-2024
సీటెట్ ఫలితాల తేదీ : జనవరి, 2025
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications