నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. CBIలో భారీగా ఉద్యోగాలు

బ్యాంకు కొలువు సాధించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదో సువర్ణ అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

మొత్తం పోస్టుల సంఖ్య : 1000, ఎస్సీ- 150, ఎస్టీ-75,ఓబీసీ-270, ఈడబ్ల్యూఎస్-100,జనరల్-405 పోస్టులు కేటాయించారు.

Central Bank of India Announces Recruitment for 1000 Credit Officer Posts

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 30, 2025

అప్లికేషన్ ముగింపు తేదీ:ఫిబ్రవరి 20,2025

విద్యార్హత:ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అర్హులే.

వయోపరిమితి: అభ్యర్థుల కనిష్ట వయసు 20 సంవత్సరాలు,కాగా గరిష్ట వయసు 30 సంవత్సరాల వరకు ఉంది. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్థులుకు వయోపరిమితిలో సడలింపు ఉంది.

పరీక్ష విధానం: ఆల్ లైన్ టెస్ట్, ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ఆన్ లైన్ టెస్టులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ ఉంటుంది. 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత లెటర్ రైటింగ్ 30 మార్కులకు ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ లో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు :జనరల్ అభ్యర్థులకు రూ. 750 కాగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళ అభ్యర్థులకు రూ. 150 గా ఉంది. పరీక్ష తేదీని త్వరలో వెల్లడించునుంది.

వేతనం : ప్రారంభ వేతనం రూ. 48,480 గా ఉంది. ఆ తర్వాత రూ. 85,920 వరకు పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+