నెలకు రూ.లక్ష జీతంతో బ్యాంకు ఉద్యోగాలు.. మరో 4 రోజులే ఛాన్స్ !

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) తీపి కబురు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 3వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్, మంచి జీతం, ప్రమోషన్ల అవకాశాలను కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలుస్తోంది. ముఖ్యంగా మార్కెటింగ్, ఫారెక్స్, ట్రేడ్ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి ఈ నోటిఫికేషన్ లాభదాయకంగా మారనుంది. ఈ ఉద్యోగ ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

central-bank-of-india-latest-notification-for-350-specialist-officer-posts-and-full-details-to-appli

మొత్తం ఖాళీలు & పోస్టుల వివరాలు..

ఈ నోటిఫికేషన్ కింద రెండు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

  • ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్ (Scale-III) - 50 పోస్టులు
  • మార్కెటింగ్ ఆఫీసర్ (Scale-I) - 300 పోస్టులు

ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో భర్తీ చేయనున్నారు.

విద్యార్హత..

అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అదేవిధంగా MBA / PGDM అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఆఫీసర్‌కు:

Forex / Trade Financeలో స్పెషలైజేషన్

బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో పని అనుభవం తప్పనిసరి

మార్కెటింగ్ ఆఫీసర్‌కు:

మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో MBA / PGDM

BFSI (Banking, Financial Services & Insurance) రంగంలో అనుభవం అవసరం

వయోపరిమితి వివరాలు..

Scale-III పోస్టులు: 30 నుంచి 38 సంవత్సరాలు

Scale-I పోస్టులు: 23 నుంచి 27 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము..

జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.850

ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు: రూ.175

ఈ ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం..

అభ్యర్థుల తుది ఎంపిక కింది దశల ఆధారంగా జరుగుతుంది:

ఆన్‌లైన్ రాత పరీక్ష

వ్యక్తిగత ఇంటర్వ్యూ (Interview)

రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. రెండు దశల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.

జీతం & ఇతర లాభాలు..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు

రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు జీతం లభిస్తుంది.

ఇదే కాకుండా:

డీఏ (DA)

హెచ్‌ఆర్‌ఏ (HRA)

ట్రావెల్ అలవెన్స్

మెడికల్, పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి ఇతర బ్యాంక్ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

ఆన్‌లైన్ రాత పరీక్ష: ఫిబ్రవరి / మార్చి

ఇంటర్వ్యూలు: మార్చి / ఏప్రిల్

పరీక్ష తేదీలను బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+