జూన్ 14 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్: సెంటర్ల వారీగా వివరాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇటీవల తుది పరీక్షల ఫలితాలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తుది పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్ (https://www.tslprb.in/) నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించిన లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లెటర్లు జూన్ 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

Certificate verification of SI, Constable candidates from June 14th

సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కేంద్రాలు ఇవే:

హైదరాబాద్: శివకుమార్ లాల్ స్టేడియం, గోషామహల్

సైబరాబాద్: సీటీసీ, సీపీ ఆఫీసు, గచ్చిబౌలి

ఆదిలాబాద్: ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ గ్రౌండ్, ఎస్పీ ఆఫీసు

కరీంనగర్: పోలీస్ హెడ్ క్వార్టర్స్

ఖమ్మం: సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్

కొత్తగూడెం: సీఈఆర్ క్లబ్, ప్రకాశ్ స్టేడియం

మహబూబాబాద్: డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, సబ్ జైలు దగ్గర

మహబూబ్‌నగర్: డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్

నాగర్ కర్నూల్: డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్

గద్వాల్: డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, జోగులాంబ గద్వాల

నల్గొండ: డార్మెటరీ హాల్, పోలీస్ హెడ్ క్వార్టర్స్

నిజామాబాద్: పోలీస్ పరేడ్ గ్రౌండ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్

రాచకొండ: సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, అంబర్‌పేట్, హైదరాబాద్

రామగుండం: సీపీ ఆఫీస్

సంగారెడ్డి: పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్

సిద్దిపేట: పోలీస్ కమిషనరేట్

సూర్యపేట: డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్

వరంగల్: సీపీ ఆఫీస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+