CPPRI Jobs 2025: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్.. డీటెయిల్స్ ఇవే..

CPPRI Jobs 2025: ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప అవకాశం వచ్చింది. సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CPPRI) రిటైర్డ్ అయిన వ్యక్తులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మంచి ఉద్యోగాలను అందిస్తోంది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ కన్సల్టెంట్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నియామకానికి అధికారిక వెబ్ సైట్ https://cppri.res.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ మార్చి 24న జరగనుంది. అభ్యర్థులు అదే రోజు ఇంటర్వ్యూ కోసం సంస్థకు చేరుకోవాలి. సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CPPRI) సహారన్పూర్ ఈ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకం కాంట్రాక్టు ప్రాతిపదికన జరుగుతోంది.

పోస్టుల వివరాలు ఇవే..
కన్సల్టెంట్ గ్రేడ్-III- ఒక పోస్టు
కన్సల్టెంట్ గ్రేడ్-I - 02 పోస్టులు

CPPRI Jobs 2025 Great Opportunity for Retired Employees - Interview-Based Job Openings

CPPRI కన్సల్టెంట్ అర్హత
ప్రభుత్వం/పీఎస్‌యూలు/విశ్వవిద్యాలయం/పరిశోధన సంస్థ/స్వయంప్రతిపత్తి సంస్థ నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తులు ఈ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు కన్సల్టెంట్ గ్రేడ్ III కి అండర్ సెక్రటరీ లేదా అదే స్థాయి గల పదవిలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు,కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అదే సమయంలో కన్సల్టెంట్ గ్రేడ్ I పదవికి, అభ్యర్థికి స్టెనోగ్రాఫర్/సెక్షన్ ఆఫీసర్ పదవిలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థులు అర్హతకు సంబంధించిన ఇతర వివరాలను కూడా అధికారిక నియామక నోటిఫికేషన్ నుండి వివరంగా తనిఖీ చేయవచ్చు.

వయోపరిమితి: ఈ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు చివరి తేదీ ఆధారంగా వయోపరిమితి లెక్కించబడుతుంది.

జీతం: కన్సల్టెంట్ గ్రేడ్ 3 పోస్టుకు నెలకు రూ.50,000 జీతం లభిస్తుంది. కన్సల్టెంట్ గ్రేడ్ 1 కి రూ.30,000 జీతం లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ- డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ - మార్చి 24 (గతంలో ఇంటర్వ్యూలు మార్చి 12న జరగాల్సి ఉండగా, తరువాత వాయిదా పడ్డాయి)

రిపోర్టింగ్ సమయం - ఉదయం 9 గంటలు

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం-సెంట్రల్ పల్ప్ & పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPPRI), సహారన్పూర్, ఉత్తరప్రదేశ్- 247001

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+