సీఆర్పీఎఫ్‌లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్న కేంద్రం: త్వరలో నోటిఫికేషన్

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. సీఆర్పీఎఫ్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి గెజిట్ నోటీఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో లెవల్ 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.

మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం.. మొత్తం 129929 పోస్టులు రిక్రూట్ చేస్తారు. వీటిలో 125262 పురుష అభ్యర్థులు, 4467 మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం 10 శాతం ఖాళీలు ఎక్స్-అగ్నివీర్లకు కేటాయించబడతాయి.

CRPF Constable Recruitment

పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానాన్ని ఉత్తీర్ణులై ఉండాలి లేదా మాజీ ఆర్మీ సిబ్బందికి సమానమైన ఆర్మీ అర్హతను కలిగి ఉండాలి.

పోస్టుకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు పరిమితి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. తదుపరి ప్రాసెసింగ్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, వ్రాత పరీక్షలో అర్హత సాధించాలి.

ప్రొబేషన్ వ్యవధి 2 సంవత్సరాలు.
పే మ్యాట్రిక్స్ రూ. 21700-69100/-
దరఖాస్తు ప్రక్రియ తేదీలు ఇంకా అధికారిక నోటీసులో భాగస్వామ్యం చేయలేదు. సీఆర్పీఎఫ్ మంత్రిత్వ శాఖ అధికారిక వివరణాత్మక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరిన్ని సంబంధిత వివరాలను తనిఖీ చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+