CRPFలో కమాండెంట్ డిప్యూటీ కమాండెంట్ పోస్టులు: అర్హతలు పూర్తి వివరాలు ఇవే..!!
సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారిని ఇంజినీరింగ్ కేడర్‌లో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు 23 సెప్టెంబర్ 2021 లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇక సీఆర్‌పీఎఫ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఇందులో కమాండెంట్ పోస్టులు రెండు ఉండగా.. డిప్యూటీ కమాండెంట్ పోస్టులు 11 ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడగలరు. కమాండెంట్ (ఇంజినీర్) పోస్టుల మొత్తం రెండు ఉన్నాయి. ఇక దీనికి అర్హతలు అభ్యర్థులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. లెవెల్ 12 పే స్కేల్2లో ఐదేళ్లు రెగ్యులర్ సర్వీస్‌లో ఉండాలి. ఇక సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమాండెంట్ పోస్టింగులు గౌహతి, జమ్మూ, హైదరాబాదు, కోల్‌కతాలో ఇచ్చే అవకాశం ఉంది.

ఇక డిప్యూటీ కమాండెంట్ పోస్టులు మొత్తం 11 ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి. లెవెల్ 10లో ఐదేళ్లుగా రెగ్యులర్ సర్వీస్‌లో పనిచేస్తూ ఉండాలి. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన పోస్టింగులు దేశంలో ఎక్కడైనా ఉండొచ్చని సీఆర్‌పీఎఫ్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఉంది.
అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అప్లికేషన్ పూర్తి చేసి పంపాలి.అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది. దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను కూడా జతపరచాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ మరియు సర్టిఫికేట్లను ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
Deputy Inspector General(Pers)
Directorate General, CRPF
CGO complex, Block No.1
Lodhi Road, New Delhi-110003
పూర్తి చేసిన దరఖాస్తులు అందేందుకు చివరితేదీ 23 సెప్టెంబర్ 2021. మరిన్ని వివరాలకు: crpf.gov.in ను సంప్రదించండి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications