సికింద్రాబాద్ డిఫెన్స్ మినిస్ట్రీ రిక్రూట్‌మెంట్: 1793 పోస్టుల కోసం అప్లై చేయండి
సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మెన్ మేట్, ఫైర్‌మెన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మెన్ మేట్, ఫైర్‌మెన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏవోసీ అధికారిక సైట్ aocrecruitment.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 1793 పోస్టులను భర్తీ చేయనుంది.
ఖాళీ వివరాలు:
ట్రేడ్స్‌మన్ మేట్: 1249 పోస్టులు
ఫైర్‌మెన్: 544 పోస్టులు
అర్హత ప్రమాణం:
ట్రేడ్ మెన్ మేట్ పోస్టులకు మెట్రిక్యూలేషన్, ఐటీఐ
ఫైర్ మెన్ ఖాళీలకు మెట్రిక్యూలేషన్.

వయో పరిమితి:
18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్:
ట్రేడ్స్‌మన్ మేట్: లెవల్-1 ₹ 18000/- నుంచి ₹ 56900/-
ఫైర్‌మ్యాన్: లెవల్-2 ₹ 19900/- నుంచి ₹ 63200/-
రీజియన్లు: ఈస్టర్న్, వెస్టర్న్, నార్తర్న్, సదరన్, సౌత్ వెస్టర్న్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎండ్యూరెన్స్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోపు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి aocrecruitment.gov.in












Click it and Unblock the Notifications