బిగ్ షాక్.. ఎస్‌ఎస్సీ సీజీఎల్ పరీక్షలు వాయిదా !
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అభ్యర్ధులకు షాక్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామినేషన్ 2025 వాయిదా పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు కమిషన్ ప్రకటించింది. పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
వాయిదాకు కారణం..
సుప్రీంకోర్టు తాజాగా కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) నిర్వహణలో సాంకేతిక లోపాలను నివారించేందుకు మార్పులు చేయాలని SSCకి సూచించింది. ఇటీవల నిర్వహించిన SSC ఫేజ్-13 పరీక్షల సమయంలో పలు కేంద్రాల్లో లాగిన్ సమస్యలు, సర్వర్ డౌన్ అవ్వడం, ప్రశ్నలు సరిగా లోడ్ కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ కారణంగా 55 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. వీరికి ఈ నెల చివరి వారంలో మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు.

భర్తీ వివరాలు..
ఈ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాలు, సంస్థల్లో మొత్తం 14,582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. SSC CGL 2025 నోటిఫికేషన్ జూన్ 9న విడుదల కాగా, జూన్ 9 నుంచి జూలై 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు.
పరీక్ష షెడ్యూల్..
టైర్-1 పరీక్షలను ఆగస్టు 13 నుంచి 30 వరకు నిర్వహించాలనే ప్రణాళిక ఉండేది. ఇవి కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలుగా జరగాల్సి ఉంది.
పరీక్ష ప్యాటర్న్.. టైర్ - 1
మొత్తం 200 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన జవాబుకు 2 మార్కులు, ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
- జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ - 25 ప్రశ్నలు (50 మార్కులు)
- జనరల్ అవేర్‌నెస్ - 25 ప్రశ్నలు (50 మార్కులు)
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు (50 మార్కులు)
- ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - 25 ప్రశ్నలు (50 మార్కులు)
విద్యార్థులపై ప్రభావం..
ఈ వాయిదా వల్ల, ఇప్పటికే సిద్ధమై ఉన్న అభ్యర్థులకు పునఃసమీక్ష చేసుకోవడానికి అదనపు సమయం దొరికినప్పటికీ, పరీక్ష కోసం ప్రణాళికాబద్ధంగా తయారైన వారిలో కొంత అసహనం వ్యక్తమవుతోంది. కొత్త తేదీల ప్రకారం రివిజన్ ప్లాన్ మార్చుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/లో తాజా అప్‌డేట్స్ చూడాలని సూచించింది. కొత్త షెడ్యూల్ త్వరలో విడుదల అవుతుందని స్పష్టం చేసింది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications