బీటెక్‌తో పాటే జాబ్.. నేవీ నుంచి నోటిఫికేషన్

దేశసేవే లక్ష్యంగా కలలు కంటున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు భారతీయ నౌకాదళం అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవీ విడుదల చేసింది. ఈ స్కీమ్ ద్వారా బీటెక్ విద్యను పూర్తిగా ఉచితంగా చదివించి, శిక్షణ అనంతరం నేరుగా సబ్ లెఫ్టినెంట్ హోదాలో నేవీలో ఉద్యోగం కల్పించనుంది.

ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ (PCM) చదివిన అభ్యర్థులు ఈ స్కీమ్‌కు అర్హులు. ముఖ్యంగా JEE Main ర్యాంక్ ఆధారంగా ఎంపిక జరగనుండటం విశేషం. అదనపు రాత పరీక్షలు లేకుండానే, జేఈఈ ర్యాంక్ + ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. పురుషులతో పాటు మహిళలకూ ఈ అవకాశాన్ని కల్పించింది నేవీ.

Free BTech Education Direct Officer Job in Indian Navy Cadet Entry Scheme Notification Released

ఈ విధానంలో ఎంపికైన అభ్యర్థులు కేరళలోని ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఎజిమలలో నాలుగేళ్ల పాటు బీటెక్ కోర్సును పూర్తి చేయాలి. ఈ కాలంలో చదువు ఖర్చులు మాత్రమే కాకుండా, వసతి, భోజనం, పుస్తకాలు అన్నీ నౌకాదళమే భరిస్తుంది. బీటెక్ డిగ్రీని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) ద్వారా ప్రదానం చేస్తారు.

శిక్షణ పూర్తయిన వెంటనే అభ్యర్థులను పర్మనెంట్ కమిషన్‌తో సబ్ లెఫ్టినెంట్‌గా నియమిస్తారు. ప్రస్తుతం ఈ హోదాకు నెలకు లక్ష రూపాయలకుపైగా వేతనంతో పాటు అలవెన్సులు, ఇతర రక్షణ సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఉద్యోగ భద్రతతో పాటు దేశసేవ చేసే గౌరవం ఈ స్కీమ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

నేవీ విడుదల చేసిన వివరాల ప్రకారం, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నిర్దిష్ట వయస్సు పరిమితిలో ఉండాలి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించినవారిని ముందుగా షార్ట్‌లిస్ట్ చేసి, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్, కోల్‌కతా కేంద్రాల్లో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ పరీక్షలు పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.

దేశ రక్షణ రంగంలో కెరీర్‌ను ఆశించే విద్యార్థులకు ఇది జీవితాన్ని మలుపుతిప్పే అవకాశంగా చెప్పవచ్చు. ఇంటర్ తర్వాత ఖరీదైన ఇంజినీరింగ్ కాలేజీల భారం లేకుండా, ఉచితంగా చదివి, గౌరవప్రదమైన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఈ స్కీమ్ ప్రత్యేకత.

నోటిఫికేషన్‌, అర్హతలు, అప్లికేషన్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని నేవీ సూచిస్తోంది.

  • అధికారిక వెబ్‌సైట్ & అప్లికేషన్ లింక్ https://www.joinindiannavy.gov.in
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+