Jobs: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళా నిరుద్యోగులకు వరం
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు, ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది ఒక చక్కని అవకాశం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు చిత్తూరు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాల వారిగా ఉద్యోగాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
తూర్పు గోదావరి జిల్లా: ఎన్‌హెచ్‌ఎం (NHM) పోస్టులు
తూర్పు గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ కింద 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో డిగ్రీ (స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ (చైల్డ్ సైకాలజీ, MA, MSc సైకాలజీ, ఆప్టోమెట్రీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు లేదా జీఎన్ఎం (GNM) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్ల మించకూడదు. ఆసక్తి గల వారు మార్చి 11 లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం eastgodavari.ap.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు.

చిత్తూరు జిల్లా: వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు
చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్‌లో 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పీజీ, డిగ్రీ (లా, సోషల్ వర్క్, సోషల్ సైన్స్, సైకాలజీ), LLB లేదా పారా మెడికల్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు అర్హులు. వయసు 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. దరఖాస్తు గడువు నేటి నుంచి మార్చి 9 వరకు ఉంది. ఆసక్తి గల వారు జిల్లా వెబ్‌సైట్ chittoor.ap.gov.in సందర్శించవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లా: 13 కాంట్రాక్ట్ పోస్టులు
పశ్చిమ గోదావరి జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 13 పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో-సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, ఎంటీఎస్ (MTS), సెక్యూరిటీ గార్డ్ వంటి ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం westgodavari.ap.gov.in వెబ్‌సైట్‌ను తనిఖీ చేయగలరు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications