తెలంగాణ ఇంటర్మీడియట్ హాలిడేస్ క్యాలెండర్ ఇదే
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెలవులు ఖరారయ్యాయి. ఇంటర్మీడియట్ కాలేజీలకు 2025-26 విద్య సంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డ్ క్యాలెండర్ విడుదల విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. అప్పటి వరకు సెలవులేనని చెప్పారు.
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ తేల్చి చెప్పింది. ఇంటర్ బోర్డ్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సెలవుల్లోనే ఉన్నారు.

ఈసారి ఇంటర్ తరగతులు 226 రోజులపాటు నిర్వహించనున్నారు. ఇక, 77 రోజులు జూనియర్ కాలేజీలకు సెలవులు రానున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ 2026 ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి.
2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు దసరా సెలవులు
నవంబర్ 10 నుంచి 15 వరకు ఇంటర్ ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్
2026 జనవరి 11 నుంచి 18 వరకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు
2026 ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ పరీక్షలు
2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications