ICSILలో ఉద్యోగాలు: 10వ తరగతి లేదా ఐటీఐ పాసైతే ఈ జాబ్స్‌కు అప్లయ్ చేయండి..!!
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ( ఐసీఎస్ఐఎల్ ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 50 ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 ఆగష్టు 2021. ఈ పోస్టులన్నీ ఒప్పంద ప్రాతిపదికనే భర్తీ చేస్తారు. ఈ పోస్టులన్నీ ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు కింద భర్తీ చేస్తారు.
సంస్థ పేరు: ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ ( ఐసీఎస్ఐఎల్ )
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ:

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.
వయస్సు: అర్హులైన అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయస్సులో మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఉంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, వయస్సు, విద్యార్హతలు, అనుభవం, వంటి పారామీటర్లను పరిగణలోకి తీసుకుని అన్ని అర్హతలు ఉంటే అభ్యర్థిని షార్ట్‌లిస్టు చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరేముందు రూ.1000 అప్లికేషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్.
వేతనం: ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ కిందనే పనిచేస్తారు. ఈ సమయంలో వారికి నెలకు రూ.19,291 వేతనంగా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అంతా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది. రొటేషనల్ లేదా షిఫ్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది.
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 16 ఆగష్టు 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 ఆగష్టు 2021.
మరిన్ని వివరాలకు :
లింక్: www.icsil.in












Click it and Unblock the Notifications