ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. డైరెక్ట్ జాబ్స్..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 5, 2025లోపు అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. రిక్రూట్ మెంట్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి. హైదరాబాద్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ప్రారంభించింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 56.. స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2 పోస్టులు 02, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 28, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టులు 26
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, డిగ్రీ లేదా తత్సమానం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్టెనో గ్రాఫర్ పోస్టులకు 12 వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి.
స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, స్వ్కాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అప్లికేషన్ విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ సమయంలో వయసు రుజువు కోసం మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్సీ లేదా తత్సమాన సర్టిఫికేట్, విద్యార్హతల సర్టిఫికెట్లు.. క్రీడలు/ ఆటల సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 5, 2025.. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ incometaxhyderabad.gov.in ను సంప్రదించండి.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక విధానం స్పోర్ట్స్ లో ప్రతిభ, విద్యార్హతల ఆధారంగా ఎంపిక ఉంటుంది.












Click it and Unblock the Notifications