Best Schools: అత్యుత్తమ స్కూల్స్‌ లిస్ట్‌లో పిచ్చెక్కించిన ఇండియా.. ప్రపంచ స్థాయిలో 3 విభాగాల్లో మనమే బెస్ట్

Education News: దేశంలోని మూడు పాఠశాలలు ప్రతిష్టాత్మకమైన 'ప్రపంచ అత్యుత్తమ పాఠశాల-2024' బహుమతులను గెలుచుకున్నాయి. తద్వారా ఈ ఏడాది రికార్డు సృష్టించినట్లైంది. ఢిల్లీలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, మధ్యప్రదేశ్‌లోని CM రైజ్ స్కూల్ వినోబా, తమిళనాడులోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వేర్వేరు విభాగాల్లో అగ్రస్థానాలను సాధించాయి. ప్రతి పాఠశాల ప్రత్యేకమైన విద్యా విధానం, కొత్త ఆవిష్కరణలు, మరియు సమాజ సేవలో చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నాయి.

ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాతావరణ పరిరక్షణ విభాగంలో ఈ బహుమతిని సాధించింది. హైడ్రోపోనిక్స్ మరియు బయోగ్యాస్ ప్లాంట్లు వంటి కార్యక్రమాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది. నీటి కొరత మరియు కాలుష్య సమస్యలపై ఈ పాఠశాల దృష్టి పెట్టింది. తమకు లభించిన 10 వేల డాలర్ల బహుమతితో పాఠశాల ప్రాజెక్టులను విస్తరించడమే కాకుండా, విద్యార్థుల ఆధ్వర్యంలోని పర్యావరణ కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చే స్టార్ట్-అప్ ఇన్క్యుబేటర్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

India got 3 prizes for World s Best School 2024

మధ్యప్రదేశ్‌లోని CM రైజ్ స్కూల్ వినోబా ఇన్నొవేషన్ విభాగంలో సత్తా చాటింది. మొదటగా పట్టణ బస్తీలో గిరిజన బాలికల పాఠశాలగా స్థాపించబడిన ఈ స్కూల్.. అనతికాలంలోనే విద్యారంగంలో ముందడుగు వేసింది. పూర్తిస్థాయిలో కేజీ నుంచి సెకండరీ గ్రేడ్ వరకు క్లాసులు నిర్వహించే స్థాయికి ఎదిగింది. విద్య ద్వారా అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఇదే పాఠశాలను పోటీలో గెలిపించింది.

India got 3 prizes for World s Best School 2024

తమిళనాడుకు చెందిన మదురైలోని కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కమ్యూనిటీ చాయిస్ అవార్డ్ గెలిచింది. 50 పాఠశాలల జాబితా నుంచి షార్ట్‌ లిస్ట్ అయింది. విద్యా కార్యక్రమాల ద్వారా సమాజాన్ని ప్రోత్సహించడంతో స్కూల్‌ను ఈ పురస్కారం వరించింది. దేశంలోని పాఠశాలలు మూడు విభాగాల్లో విజయం సాధించి విద్యా రంగంలో భారత్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాయి.

India got 3 prizes for World s Best School 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+