టెన్త్ అర్హతతో ఎయిర్ ఫోర్స్‌లో ఛాన్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అగ్నివీర్ (Agniveer) వాయు పోస్టుల కోసం ఆసక్తి చూపుతున్న అభ్యర్థులకు మంచి అవకాశం. గతంలో ఫిబ్రవరి 1 వరకు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించబడుతుండగా, ఇప్పుడు ఈ గడువును ఫిబ్రవరి 8 వరకు పొడిగించామని అధికారికంగా ప్రకటించారు.
ఈ పోస్టులకు డిప్లొమా, ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి విద్యార్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు పరిమితి కూడా ఖచ్చితంగా నిర్ణయించారు. అభ్యర్థులు జనవరి 1, 2006 నుండి జూలై 1, 2009 మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.

విద్యార్హత.. ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ వృత్తిపర కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లిష్‌లో కూడా కనీస మార్కులు ఉండాలి.
ప్రత్యామ్నాయంగా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులుగా పరిగణించబడతారు. అభ్యర్థులు జనవరి 1, 2006 నుంచి జూలై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఐఏఎఫ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎత్తు, బరువు, ఛాతీ విస్తీర్ణం, శారీరక సామర్థ్య ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. పురుషులు, మహిళల కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము..
ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.550 తో పాటు జీఎస్‌టీ కలిపి దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత మాత్రమే దరఖాస్తు ప్రక్రియ పూర్తైనట్లు పరిగణిస్తారు.
ఎంపిక ప్రక్రియ..
అగ్నివీర్ వాయు నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో మార్చి 30 మరియు 31 తేదీలలో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అభ్యర్థుల అకాడమిక్ పరిజ్ఞానం, లాజికల్ అబిలిటీని పరీక్షిస్తారు. రెండవ దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)తో పాటు అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 నిర్వహిస్తారు. చివరి దశలో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది.
యువతకు స్వర్ణావకాశం..
కాగా అగ్నిపథ్ పథకం ద్వారా యువతకు దేశ రక్షణలో భాగస్వాములు కావడంతో పాటు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగేళ్ల సేవ అనంతరం అగ్నివీర్లకు ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్తు కెరీర్‌కు దోహదపడే అవకాశాలు కల్పించబడతాయి.
దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఉన్న యువతకు అగ్నివీర్ వాయు (1/2027) నియామకాలు ఒక అరుదైన, గౌరవప్రదమైన అవకాశంగా నిలవనున్నాయి.












Click it and Unblock the Notifications