ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. అప్లై చేశారా..?

కేవలం టెన్త్, ఇంటర్ విద్యార్హతతోనే భారత తీరరక్షక దళంలో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్​ న్యూస్​. ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ 260 నావిక్​ (జనరల్ డ్యూటీ), నావిక్​ (డొమెస్టిక్​ బ్రాంచ్​) 40 యాంత్రిక్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 25లోగా​ ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

మొత్తం పోస్టుల సంఖ్య
నావిక్​ (జనరల్ డ్యూటీ) - 260 పోస్టులు
నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) - 40 పోస్టులు

Indian Coast Guard Announces Recruitment for 260 Navik amp amp 40 Mechanic Posts Apply Online by February 25

విద్యార్హతలు

నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
నావిక్​ (జనరల్ డ్యూటీ) : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డ్ నుంచి 10+2 క్వాలిఫై అయ్యుండాలి.
యాంత్రిక్ పోస్టులు : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్​, మెకానికల్​, ఎలక్ట్రానిక్స్​, టెలికమ్యునికేషన్ (రేడియో/ పవర్​) ఇంజినీరింగ్ చేసి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం

అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్​మెంట్​/ అడాప్టబిలిటీ టెస్ట్​, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు

నావిక్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ శాలరీగా రూ.21,700 చెల్లిస్తారు. యాంత్రిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.29,200 అందిస్తారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా జాయిన్ ఇండియా కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి. మీ పేరు మీద రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి. విద్యార్హత పత్రాలు అప్​లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​లో చెల్లించి, దరఖాస్తును సబ్​మిట్ చేయాలి. భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్​లైన్​ దరఖాస్తు ప్రారంభ తేదీ : 2025 ఫిబ్రవరి 2​
ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2025 ఫిబ్రవరి 25

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+