నిరుద్యోగులకు ఐఓసీఎల్ గుడ్ న్యూస్.. 537 పోస్టులకు నోటిఫికేషన్ !
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్ధులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) గుడ్ న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లలో ఖాళీగా ఉన్న 537 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి IOCL అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి ఆకర్షణీయమైన స్టైఫండ్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం ఖాళీలు..
537
పోస్టుల వివరాలు..
- ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్ - 156 పోస్టులు
- వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్ - 152 పోస్టులు
- నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్ - 97 పోస్టులు
- సదరన్ రీజియన్ పైప్‌లైన్స్ - 47 పోస్టులు
- సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్ - 85 పోస్టులు

అర్హతలు..
కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఇంటర్మీడియట్ పాస్ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే వయో పరిమితి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది (SC, ST, OBC, EWS, PwD అభ్యర్థులకు రిజర్వేషన్, వయో మినహాయింపు వర్తిస్తుంది).
ఎంపిక విధానం..
అభ్యర్థుల ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. అవసరమైతే అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా లిఖిత పరీక్ష ద్వారా కూడా పరిశీలించే అవకాశం ఉంది.
దరఖాస్తు గడువు..
29 ఆగస్టు 2025 నుంచి 18 సెప్టెంబర్ 2025 వరకు
వేతనం..
అప్రెంటిస్‌గా ఎంపికైన అభ్యర్థులకు IOCL నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ అందజేస్తారు. ఇది అర్హత (ITI, డిప్లొమా, డిగ్రీ ఆధారంగా) మారుతూ ఉంటుంది. సగటున రూ.9,000 - రూ.15,000 మధ్య స్టైఫండ్ లభించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేటప్పుడు అన్ని అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. తప్పు సమాచారం ఇస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/apprenticeships చూడవచ్చు. అప్లికేషన్ లింక్ కోసం ఈ లింక్ https://plapps.indianoilpipelines.in/ క్లిక్ చేయండి.
సూచనలు..
- అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ రీజియన్‌లకు దరఖాస్తు చేయకూడదు.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనంతరం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
- ఎంపికైన అప్రెంటిస్‌లకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
- ఇది భవిష్యత్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ నియామకాలలో ఉపయోగపడుతుంది.












Click it and Unblock the Notifications