Jobs: పది పాసయ్యారా.. అయితే మీ కోసం 30 వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి..

మీరు పదో తరగతి పాస్ అయ్యారా.. అయితే కోసం 30 వేలకు పైగా పోస్టాల్ ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి అర్హతతో దాదాపు 30 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్టాల్ డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పది పాసై అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. indiapostgdsonline.gov.in వెబ్ సైట్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి గడువు ఆగస్టు 23 వరకు ఉంది.

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26 వరకు సవరించుకునే అవకాశం కల్పించారు. ఇండియా పోస్ట్ మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 30041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్ట్‌లను భర్తి చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా/రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే గణితం, ఆంగ్లంలో ఉత్తీర్ణత (నిర్బంధ లేదా ఎంపిక సబ్జెక్టులుగా చదివి) 10వ తరగతికి చెందిన సెకండరీ స్కూల్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి.

indiapostofficerecruitment1

అభ్యర్థులు కనీసం సెకండరీ స్టాండర్డ్ వరకు స్థానిక భాషను తప్పనిసరి లేదా ఐచ్ఛిక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా ₹100 చెల్లించాలి. అన్ని మహిళా / ట్రాన్స్-ఉమెన్ అభ్యర్థులు, SC/ST అభ్యర్థులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే : indiapostgdsonline.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాతా వివరాలు నమోదు చేసి దరఖాస్తుతో కొనసాగించాలి. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తును సమర్పించి దాన్ని ప్రింట్ కూడా తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+