భారీ జీతంతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..DON'T MISS !

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి తీపి కబురు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారీ జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఖాళీలు..

455

పోస్టు పేరు..

జూనియర్ ఇంటెలిజెన్స్ (సెక్యూరిటీ అసిస్టెంట్).

intelligence-bureau-notification-for-455-jobs

విద్యార్హత..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, మరియు మోటార్ మెకానిజంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు..

దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు వేతనం లభిస్తుంది.

దరఖాస్తు గడువు..

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. చివరి తేదీ సెప్టెంబర్ 28 వరకు ఉంది.

ఎంపిక ప్రక్రియ..

మొదటి దశ (టైర్-1): ఇందులో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, మరియు ఇంగ్లీష్ భాషపై ప్రశ్నలు ఉంటాయి.

రెండో దశ (టైర్-2): ఈ దశలో అభ్యర్థులకు మోటార్ మెకానిజం, డ్రైవింగ్ పరీక్షలు ఉంటాయి. ఈ రెండు దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులు తుది ఎంపికకు అర్హులవుతారు.

దరఖాస్తు విధానం..

మరింత సమాచారం కోసం అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ను చెక్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+