తెలంగాణలో ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లీమెంటరీ రిజల్ట్స్ రిలీజ్..
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారికంగా ఈరోజు (జూన్ 10) మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ ప్రకటించింది. ఈ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in. లో చూసుకోవచ్చు. అంతేకాకుండా, ఫలితాలు మనబడి, స్కూల్9, ఇండియా రిజల్ట్స్ లాంటి ప్రైవేట్ వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయి.
కాగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుండి మే 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 4.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జోసా కౌన్సెలింగ్ (JoSAA), ఈఏపీసెట్ (EAPCET), నీట్ (NEET), జేఈఈ (JEE), ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు అర్హత పొందేందుకు ఇంటర్ మార్కులే ఆధారం అవుతాయి. ఈ క్రమంలోనే పరీక్షలు నిర్వహించిన తక్కువ కాలంలోనే ఫలితాలను విడుదల చేసినట్టు తెలుస్తోంది.

ఫలితాలను ఎలా చెక్ చేయాలి..
అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in ఓపెన్ చేయండి
"IPE Advanced Supplementary Results 2025" లింక్‌పై క్లిక్ చేయండి
హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, "Get Result" క్లిక్ చేయండి
ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి - వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు
విద్యార్థులకు సూచనలు..
ఫలితాల్లో ఏదైనా సమస్య ఉంటే, సంబంధిత కాలేజ్ లేదా బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలి
మెమోస్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది
సర్టిఫికెట్ అవసరమైతే డిజిటల్ విధానంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్‌కు ఓ 'సెకండ్ ఛాన్స్' లాంటివి. ఒకవేళ ఈ సప్లిమెంటరీలో కూడా ఫెయిలైతే, విద్యార్థులు వచ్చే ఏడాది వరకు ఎదైనా ప్రవేశ పరీక్షలు రాయలేరు, లేదా హయ్యర్ స్టడీస్‌కి అడుగుపెట్టలేరు. ఫెయిల్ అయినవారు డిప్రెషన్‌కి లోనవకుండా, స్ఫూర్తిగా మరలా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావాలని సూచిస్తున్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications