IPRలో క్లర్కు ఉద్యోగాలు..డిగ్రీ అర్హత..త్వరపడండి..!!
కేంద్ర ప్రభుత్వ సంస్థ అటామిక్ ఎనర్జీ శాఖకు అనుబంధగా కొనసాగుతోన్న ఇన్స్‌టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. ఇన్స్‌టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ సంస్థలో బేసిక్ ప్లాస్మా ఫిజిక్స్ పై పరిశోధనలు జరుగుతాయి. ఈ సంస్థ గాంధీనగర్‌లోని భట్‌లో ఉంది.
మొత్తం 5 క్లర్కు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఒక పోస్టు ఎస్టీకి కేటాయించగా, 3 పోస్టులు ఓబీసీ, ఒక పోస్టు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు7వ వేతన సంఘం లెవెల్ -2 కింద జీతం చెల్లించడం జరుగుతుంది. అంటే నెలకు రూ.19,900/- చెల్లించడం జరుగుతుంది. వయసు వివరాల విషయానికొస్తే ఎస్టీ అభ్యర్థులు గరిష్టంగా 30 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 28 ఏళ్లు, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్టంగా 25 ఏళ్లు ఉండాల్సి ఉంటుంది.

ఇక ఈ క్లర్కు పోస్టులకు దరఖాస్తు చేయదలుచుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు కంప్యూటర్‌లో ఒక సర్టిఫైడ్ కోర్సును సైతం పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు సాధారణ పరిపాలన, అకౌంట్స్, పర్చేస్ స్టోర్లలో నియమించబడతారు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల నుంచి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అంటే వయస్సు ,విద్యార్హతలు, కేటగిరీ, అనుభవం సర్టిఫికేట్‌లు, ఫీజు రశీదును పరిశీలించి అన్నీ సరిగ్గా ఉన్న దరఖాస్తులను మాత్రమే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక ఎంపిక ప్రక్రియ రెండు లెవెల్స్ ద్వారా జరుగుతుంది. రాత పరీక్ష అబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.200/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 15 నవంబర్ 2021. పూర్తి వివరాలకు : http://www.ipr.res.in/documents/jobs_career.html వెబ్‌సైట్‌ను సందర్శించండి.












Click it and Unblock the Notifications