హైదరాబాద్ ఐఆర్‌డీఏఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: నగరంలోని ఇన్స్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రీసెర్చ్, జనరలిస్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫకేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా రూ.750లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.45,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
మొత్తం 160 మార్కులకుగాను 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్ ల్యాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ పరీక్షలో భాగంగా ఇంగ్లీష్, ఎకనామిక్, సోషల్, ఇన్సూరెన్స్‌మేనేజ్‌మెంట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. ప్రతిపేపర్‌కు 60 నిమిషాలు సమయం కేటాయిస్తారు.
మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications