ISP Nashik Recruitment: వందకుపైగా పోస్టులు, మంచి జీతం, వెంటనే అప్లై చేయండి
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్‌పీ) 108 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి పోటీ పడితే ఐటీఐ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
నాసిక్ సెక్యూరిటీ ప్రెస్‌లో పాస్‌పోర్ట్‌లు, ఇతర ప్రయాణ డాక్యుమెంట్లు, పోస్టేజ్ స్టాంపులు, పోస్ట్ కార్డులు, ఇన్‌లాండ్ లెటర్లు, ఎన్వలప్‌లు, నాన్ జ్యుడీషియల్, రెవెన్యూ స్టాంపులు మొదలైనవి ముద్రిస్తారు. తాజా నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 108 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్ట్‌లు: 108
సంక్షేమ అధికారి 01
జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్) 41
జూనియర్ టెక్నీషియన్ (నియంత్రణ) 41
జూనియర్ టెక్నీషియన్ (స్టూడియో) 04
జూనియర్ టెక్నీషియన్ (స్టోర్) 04
జూనియర్ టెక్నీషియన్ (CSD) 05
జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) 01
జూనియర్ టెక్నీషియన్ (గ్రైండర్) 01
జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) 01
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) 04
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 02
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్) 03
వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ పాసై.. మరాఠీ భాష తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ/పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/పర్సనల్ ఆఫీసర్/హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయో పరిమితి:
31.07.2023 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి.
జీతం వివరాలు:
నెలకు రూ. 29,740 నుంచి రూ. 1,03,000 ఉండాలి.
జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించిన విభాగంలో ఫుల్‌టైమ్ ఐటీఐ సర్టిఫికెట్/ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా ఉత్తీర్ణత పొందివుండాలి.
వయోపరిమితి:
31.07.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
నెలకు రూ. 18,780 నుంచి 67,390.
హారిజంటల్ రిజర్వేషన్ కింద పీడబ్ల్యూడీలకు 4, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 10 పోస్టులకు కేటాయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2023
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications