నిరుద్యోగులకు ఇస్రో బంపరాఫర్.. నెలకు రూ.50 వేల జీతంతో !
నిరుద్యోగ యువతకు ఇది ఒక అద్భుత అవకాశం. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనంతో పాటు ఉజ్వల భవిష్యత్తు కూడా లభిస్తుంది.
ఉద్యోగ ఖాళీలు..
ISRO బెంగళూరు కేంద్రంగా 320 సైంటిస్ట్/ఇంజినీర్ 'SC' గ్రూప్-A గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు..
సైంటిస్ట్/ఇంజినీర్-SC (ఎలక్ట్రానిక్స్) - 113 పోస్టులు
సైంటిస్ట్/ఇంజినీర్-SC (మెకానికల్) - 160 పోస్టులు
సైంటిస్ట్/ఇంజినీర్-SC (కంప్యూటర్ సైన్స్) - 44 పోస్టులు
సైంటిస్ట్/ఇంజినీర్-SC (ఎలక్ట్రానిక్స్ - PRL) - 02 పోస్టులు
సైంటిస్ట్/ఇంజినీర్-SC (కంప్యూటర్ సైన్స్ - PRL) - 01 పోస్టు
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 65% మార్కులతో BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో చదివి ఉండాలి.
వయో పరిమితి..
2025 జూన్ 16 నాటికి అభ్యర్థులు 28 ఏళ్లు మించకూడదు. అయితే, వయస్సు సడలింపు ఇలా ఉంది:
OBC అభ్యర్థులకు - 3 ఏళ్లు
SC/ST అభ్యర్థులకు - 5 ఏళ్లు
దివ్యాంగులకు - 10 ఏళ్లు
దరఖాస్తు వివరాలు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 మే 27
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 16
దరఖాస్తు ఫీజు: రూ. 250
ఎంపిక విధానం..
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
పరీక్షా కేంద్రాలు..
అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్నౌ, ముంబయి, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ వేతనం ₹56,100 లభిస్తుంది. అదనంగా ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా అందుతాయి.
పూర్తి వివరాల కోసం అలానే దరఖాస్తు చేసేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.isro.gov.in/ ను సందర్శించండి...












Click it and Unblock the Notifications