JEE Mains 2024 Answer Key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఆన్సర్ కీ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగిన సెషన్ 1 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in లో అందుబాటులో ఉంచింది. ఈ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్ పీడీఎఫ్ ను కూడా అందుబాటులో ఉంచుతోంది.

జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకునేందుకు ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in లోకి వెళ్లాల్సి ఉంటుంది. హోంపేజ్ లో EE MAIN 2024 ANSWER KEY LIVE' పేరుతో ఓ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కొత్త పేజ్ లోకి వెళ్తుంది. అక్కడ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని, క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే లాగిన్ అవుతారు. అప్పుడు మరో కొత్త పేజ్ లోకి వెళ్తుంది.

JEE Main 2024 session 1 Provisional Answer Key released- here is how to check

అక్కడ JEE Main 2024 session 1 ఆన్సర్ కీ ఉంటుంది. అదే పేజీలో అభ్యంతరాలు తెలిపేందుకు ఆన్సర్ కీలో తప్పులుంటే ఎన్టీఏ దృష్టికి తెచ్చేందుకు రైజ్ టూ ఛాలెంజెస్ పేరుతో మరో ఆప్షన్ ఉంటుంది. అక్కడ నిర్ణీత ఫీజు చెల్లించి అభ్యర్ధులు తమ అభ్యంతరాలు ఎన్టీఏకి పంపవచ్చు. ఈ పేమెంట్ స్లిప్ ను ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకోవాలి. ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తుది ఆన్సర్ కీని, ఫలితాలను ఈ నెల 12న విడుదల చేస్తుంది.

ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 2కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 2 వరకూ ఇది కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష రాయాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పిస్తోంది. ఏప్రిల్ లో సెషన్ 2 పరీక్ష నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+