NTPC Jobs: ఎన్టీపీసీలో రూ.55 వేల వేతనంతో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

NTPC Jobs: దేళంలోని అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్టుల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమైంది. మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. చిన్న నోటిఫికేషన్ ను ఎన్టీపీసీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి పూర్తి అర్హత ప్రమాణాలు, జీతం వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారంతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. సాలరీ గరిష్టంగా రూ. 55,000 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎన్టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ వివరాలు ఇలా..
*సంస్థ-ఎన్టీపీసీ లిమిటెడ్
*మొత్తం ఖాళీలు -400
*పోస్ట్ పేరు- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్)
*ఉద్యోగ ప్రదేశం- భారతదేశం అంతటా..
*అప్లికేషన్ మోడ్ - ఆన్ లైన్
*దరఖాస్తు ప్రారంభ తేదీ- ఫిబ్రవరి 15, 2025
*దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - మార్చి 1, 2025
*అధికారిక వెబ్ సైట్ - ntpc.co.in

Job Openings in NTPC with Rs 55 000 Salary Apply Now

విద్యా అర్హత

బీఈ/బీటెక్ చేసిన వారిని అర్హులుగా ఎన్టీపీసీ పేర్కొంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) స్థానానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా సంబంధిత రంగాలలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా అభ్యర్థులు పవర్ ప్లాంట్ ఆపరేషన్స్ లేదా ఇలాంటి రంగంలో ముందస్తు అనుభవం కలిగి ఉండాలి.

వయో పరిమితి
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు అందించబడతాయి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఇంటర్వ్యూ తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

*ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్ ను జాగ్రత్తగా చదవాలి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు అన్ని సర్టిఫికేట్లు సిద్ధంగా ఉన్నాయో నిర్దారించుకోవాలి.

దరఖాస్తు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి..
*అధికారిక ఎన్టీపీసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి - ntpc.co.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
*కెరీర్స్ విభాగానికి వెళ్లండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) రిక్రూట్ మెంట్ 2025 ప్రకటనను కనుగొనడానికి 'నోటీస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
*అధికారిక నోటిఫికేషన్ చదవండి - అర్హత, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర ముఖ్యమైన వివరాలను అర్థం చేసుకోవడానికి వివరణాత్మక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా సమీక్షించండి.
*దరఖాస్తు ఫారమ్‌ను నమోదు చేసి పూరించండి.
*అవసరమైన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయండి.
*దరఖాస్తు రుసుము చెల్లించడి.
* దరఖాస్తును సమర్పించి..భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

దరఖాస్తు చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+