లక్షకు పైగా జీతంతో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలను పొందే అవకాశం ఇస్తుంది. ఈ మేరకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 24, 2025లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్నవారికి ఇది మంచి ప్లాట్‌ఫామ్ అని.. జాబ్ చేజిక్కించుకునేందుకు ఇదే మంచి సమయం అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య..
309
పోస్ట్ పేరు..
Junior Executive (Air Traffic Control)
అర్హత..
అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్న డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణత తప్పనిసరి.
వయో పరిమితి..
2025 ఏప్రిల్ 24 నాటికి 27 ఏళ్లు లోపు ఉండాలి.
వయస్సు సడలింపు..
ఓబీసీ అభ్యర్థులు - 3 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు - 5 సంవత్సరాలు
దివ్యాంగులు - 10 సంవత్సరాలు
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.aai.aero/ ను చూడొచ్చు.
దరఖాస్తు గడువు..
ఏప్రిల్ 25, 2025 - మే 24, 2025 వరకు
దరఖాస్తు ఫీజు..
సాధారణ/OBC/EWS అభ్యర్థులు - రూ. 1000
SC/ST/PwD అభ్యర్థులు - ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
అప్లికేషన్ వెరిఫికేషన్
వాయిస్ టెస్ట్
సైకో యాక్టివ్ టెస్ట్
సైకాలజికల్ అసెస్మెంట్
ఫిజికల్ & మెడికల్ ఎగ్జామినేషన్
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 - రూ.1,40,000 శ్రేణిలో వేతనం ఉంటుంది. అలానే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications